ఘ‌నంగా హ‌ఫీజ్‌పేట్‌ శ్రీదేవి, భూదేవి స‌మేత కళ్యాణ‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌య వార్షికోత్స‌వం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌లోని శ్రీదేవి భూదేవి స‌మేత క‌ల్యాణ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం 13వ వార్సికోత్స‌వం శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌లు నిమ్మ‌ల వేణుగోపాల్ ప‌టేల్‌, నిమ్మ‌ల రామ‌కృష్ణ గౌడ్‌, నిమ్మ‌ల ఆనంద్ గౌడ్‌ల ఆద్వ‌ర్యంలో శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. బిజెపి ఓబిసీ మోర్చ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు బోయిని మ‌హేష్ యాద‌వ్, అనుష దంప‌తులు వేడుక‌ల్లో పాల్గొని శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని స్వామివారిని ద‌ర్శించుకుని అన్న‌ప్ర‌సాదాన్ని స్వీక‌రించారు.

క‌ళ్యాణ వెంక‌టేశ్వ‌ర స్వామి పూజ‌లో పాల్గొన్ని బోయిని మ‌హేష్ యాద‌వ్‌, నిమ్మ‌ల రామ‌కృష్ణ గౌడ్ దంప‌తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here