నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురానగర్, ప్రశాంతి హిల్స్ కాలనీలలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాల వద్ద మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, మంత్రిప్రగాఢ సత్యనారాయణ, రమేష్ గౌడ్, జగదీష్, మల్లేష్, వినోద్, రాజు, నారాయణ, గోవింద్, శ్యామ్ లెట్ శ్రీనివాస్, నవాజ్, సుధీర్ సతీష్, ఖాదర్, అనిల్, మహేందర్, ఫయాజ్, విజయలక్ష్మి, సుగుణ, బాలమణి, అరుణ కాలనీ వాసులు పాల్గొన్నారు.