నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ సగర సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి, అభినందించారు. అంజయ్య నగర్ సగర సంఘం అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అంజయ్య నగర్ సగర సంఘం అభివృద్ధికి కృషి చేయాలని, సగరుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, అంజయ్య నగర్ సాగరసంగం అధ్యక్షుడు మొడల నర్సింహ సాగర్, ప్రధాన కార్యదర్శి గడ్డపార రవిసాగర్, కోశాధికారి రవిసాగర్ మరియు చంద్రమోహన్ సాగర్, సుర రాజుసాగర్ దిండి తిరుపతి సాగర్, గుంటి కృష్ణ సాగర్, జి. సత్యనారాయణ సాగర్, రామకృష్ణ, బీఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు కృష్ణ కుమారి, విమల, రేణుక , స్వప్న పాల్గొన్నారు.