మరింత వెలుగునిస్తాం

  • 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు
  • అవసరమైతే మరిన్ని కంటి వైద్య శిబిరం కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
  • సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వెల్లడి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 2వ విడత కంటి వెలుగు అవగాహన కార్యక్రమంపై మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన, కార్పొరేటర్లు హమీద్ పటెల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ గారు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డి, రోజాదేవి రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం మొదటి దశ విజయవంత మైందని, వృద్దుల కోసం, కంటి సమస్యలు ఉన్న వారి కోసం వారి జీవితాలలో వెలుగులు నింపాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్ల పై కంటి వెలుగు అవగాహన సదస్సు, సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కంటి వెలుగు శిబిరాల ఏర్పాట్లకు తీసుకోవాల్సిన చర్యల పై సమీక్షా సమావేశంలో చర్చినట్లు తెలిపారు. అవసరమైతే అదనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 1,83,000 మందిని పరిశీలించి 40000 మందికి కళ్ళ అద్దాలు ఇచ్చామని, అదే స్ఫూర్తితో రెండో దఫా ప్రారంభిస్తున్నామని వివరించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించే ఈ క్యాంపులో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది, ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏఎన్ ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో టీంలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

  • కంటి వెలుగు కేంద్రాల వివరాలు
  • కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లోని సగర సంఘం కమ్యూనిటీ హాల్ , ప్రేమ్ నగర్ కమ్యూనిటీ హాల్ , మార్తాండ్ నగర్ ప్రభుత్వ పాఠశాల.
  • గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా లోని మహిళ భవనం, రాయదుర్గం వార్డ్ కార్యాలయం.
  • శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్, సురభి కాలనీ కమ్యూనిటీ హాల్
  • మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలోని కల్చరల్ క్లబ్, సుభాష్ చంద్రబోస్ నగర్ లోని సెయింట్ ఇసాక్ పాఠశాల, గోకుల్ ప్లాట్స్ కమ్యూనిటీ హాల్.
  • మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కమ్యూనిటీ హాల్, JP నగర్ కమ్యూనిటీ హాల్.
  • హఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని మహిళ భవనం హఫీజ్పెట్, గంగారాం కమ్యూనిటీ హాల్.
  • చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియం, వేమన కాలనీ కమ్యూనిటీ హాల్, దీప్తి శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్.
  • భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG లోని సిర్కి కార్యాలయం.
  • హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కమ్యూనిటీ హాల్.
  • ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కమ్యూనిటీ హాల్.
  • వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లోని మెడల్ మార్కెట్ లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించనున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు మాన్వి, ఉష రాణి, డాక్టర్ తీర్థ సాయి, డాక్టర్ అరవింద్, AMOH కార్తీక్, AMOH మమత గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, ఆయా డివిజన్ల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, మరబోయిన రాజు యాదవ్, సమ్మారెడ్డి, గౌతమ్ గౌడ్, లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు వాలా హరీష్ రావు, గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ పోతుల రాజేందర్ పాల్గొన్నారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here