- కాలనీల వాసుల విజ్ఙప్తి మేరకు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆలిండ్ ఎంప్లాయిస్ కాలనీ, సుదర్శన్ నగర్ కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆ కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. కొన్ని రోజులుగా మంచినీటి సమస్య ఎదురైనదని, తక్కువ ప్రెజర్ తో మంచి నీరు సరఫరా చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఎమ్మెల్యే గాంధీ స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. కాలనీలలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సత్యనారాయణ, సత్యం, జీవరత్నం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, సాయి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్, ఉన్నం ప్రసాద్ పాల్గొన్నారు.