న్యూ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధి న్యూ కాలనీలో  పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ రాజు, హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ & ఎస్ బీ డీజీఎం నాగప్రియ, మేనేజర్ సునీత, ఏఈ దుర్గాప్రసాద్, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్  పాదయాత్ర చేపట్టారు.

కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ వివరిస్తున్న స్థానికులు

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ కాలనీలోని పలు సమస్యల పరిష్కారానికి  చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించామని తెలిపారు. న్యూ కాలనీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, కాలనీలలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. నూతనంగా నిర్మాణం చేపట్టే యూజీడీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు తెలిపారు.

కాలనీలో తలెత్తిన సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్ స్పెక్టర్లు నవీన్, లింగయ్య, ఎస్ఆర్పి కనకరాజు, మహేష్, స్థానిక నాయకులు లక్ష్మణ్ గౌడ్ , కేఎస్ఎన్ రాజు, లావణ్య, వరలక్ష్మి, తిమ్మ రాజు, నరేష్ నాయక్, వెంకటేష్ గౌడ్ దుర్గేష్, జూపల్లి శంకర్, హైటెక్స్ రాజు, ఎం రాజేష్, శ్రీశైలం, రవి, అశోక్, జ్యోతి, లక్ష్మి, మహేష్, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here