నమస్తే శేరిలింగంపల్లి : హైదరనగర్ డివిజన్ భాగ్యనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కాలనీలోని పార్కులు, పార్కింగ్ మౌలిక వసతుల అభివృద్ధిపై శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భాగ్యనగర్ కాలనీ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సమస్యలపై కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ ఇతర అధికారులతో కలిసి ట్రాఫిక్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నేడు మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండాలని, తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు. గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం ఉంటుందని మరో సారి స్పష్టం చేశారు.
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపధ్యంలో శేరిలింగంపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కార్పొరేటర్లు భాను ప్రసాద్, జానకీరామరాజు, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, కున సత్యం గౌడ్, కావూరి ప్రసాద్, శ్రీనివాసరావు, కాలనీ అధ్యక్షులు దాస్, వేణు గోపాల్, పెద్దరవు, సైదేశ్వర్ రావు పాల్గొన్నారు.