చందనగర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీలలో సిసి కెమెరాల ఏర్పాటుకు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. బుధవారం చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ లో అన్నపూర్ణ ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 4.5 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ కాస్ట్రో గారు, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఆరెకపూడి గాంధీ సిసి కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు అన్నపూర్ణ ఎనక్లేవ్ వాసులు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని, సీసీ కెమెరాల ఏర్పాటు పై కాలనీ వాసులకు విస్తృత ప్రచారంతో అవగాహన కలిగిస్తున్నారని తెలిపారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలిసుల తో సమానమని, అన్ని కాలనీల ప్రజలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు దాసరి గోపి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, గుడ్ల ధనలక్ష్మీ , గోవర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమణమూర్తి , గౌరవ అధ్యక్షులు అంతి రెడ్డి, ప్రెసిడెంట్ లింగా రెడ్డి ,వర్కింగ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్,ఆశి రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అడ్వైజర్ జైపాల్ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.