అన్న‌పూర్ణలో సాయినాథుడిని ద‌ర్శించుకున్న డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శార‌దా పీఠ‌పాలిత శ్రీ సాయిబాబా, అన్న‌పూర్ణ స‌మేత కాశీ విశ్వేష్వ‌రాల‌యంలో మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు బుద‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కాల‌నీలో సీసీ కెమెరాల ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లుతో పాటు మియాపూర్ ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, చందాన‌గ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ క్యాస్ట్రోలు దేవాల‌యంను సంద‌ర్శించి ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పోలీసు ఉన్న‌తాధికారులకు ప్ర‌ధానార్చకులు అర్చ‌కులు ఆశీర్వ‌దించ‌గా, ఆల‌య క‌మిటి చైర్మ‌న్ యూవీ ర‌మ‌ణమూర్తి ఆల‌య సాంప్ర‌దాయం ప్ర‌కారం వారిని ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిటీ స‌భ్యులు చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

‌డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్ క్యాస్ట్రోల‌ను స‌న్మానిస్తున్న ఆల‌య క‌మిటి చైర్మ‌న్ యూవీ ర‌మ‌ణమూర్తి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here