కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అభినందించదగ్గ విషయమని కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హామీద్ పటేల్ అన్నారు. బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వర కాలనీలోని బెరయ గాస్పెల్ చర్చి లో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హమీద్పటేల్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆధునిక మొబైల్ వాహనం లో ఎక్సరే, ఈసిజి, వంటి పరిక్షలతో పాటు బిపి, షుగర్, దంత పరీక్షలు, నేత్ర పరీక్షలు నిర్వహించి రిపోర్టులతో పాటు మందులు అందించడం గొప్ప విషయమని తెలిపారు. వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రజలు ఉచిత శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జెర్మయ, జీవరాజ్, కెన్నడీ, బాల్ రెడ్డి, నిర్మల, కె. మధు, ముదిరాజ్, దీపక్, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు బాబురావు, ప్రభుదాస్, కమలాకర్, ఫ్రాన్సిస్, ఫిలిప్, రూథ్ తదితరులు పాల్గొన్నారు






