నాలా పనులను తరితగతిన పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీలో నాలా విస్తరణ పనులపై తీసుకోవాల్సిన చర్యలపై GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సాయి వైభవ్ కాలనీలో గతంలో వర్షాలకు నాలా పొంగి కాలనీ అంతా ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి విదితమేనని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాలనీలోని నాల విస్తరణను పొడిగించాలని అధికారులను ఆదేశించారు. నాలా విస్తరణ, పొడిగింపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలకు ప్రశాంత వాతావరణం కలిపించాలన్నారు. నాలా పొంగకుండా రాబోయే వర్షకాలం లోపు పనులు పూర్తి చేయాలని, నాలా విస్తరణ పనుల పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

నాలా సమస్య గురించి అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ

కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్, DE విశాలాక్షి, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ TPS రవీందర్ బీఆర్ ఎస్ నాయకులు ప్రసాద్, రమేష్, సాయి వైభవ్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రాజు, పద్మావతి జనరల్ సెక్రటరీ, కాలనీ వాసులు అప్పారావు, దిలీప్, సుధాకర్ ,బాబు, కృష్ణ పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here