- సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రతి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. నేటికీ ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ భూములు భూదాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, అక్రమ కబ్జాలకు గురవుతున్నాయని అలాంటి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇవ్వకపోతే భూ పోరాటాల ద్వారా సిపిఐ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకొని ఇండ్ల స్థలాల ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో సిపిఐ పార్టీని అన్ని గ్రామాలకు విస్తరించాలని బలమైన పార్టీగా తీర్చిదిద్దాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కే చందు యాదవ్, కె వెంకటస్వామి, మండల కార్యవర్గ సభ్యులు కే ఖాసీం లింగం. రాములు. టి కృష్ణ. చిట్టి శ్రీనివాస్.ఎం వెంకటేష్. ఎస్ నరసమ్మ. కే సుధాకర్. రామస్వామి. కే లక్ష్మీ. ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక..
సిపిఐ నియోజకవర్గ కమిటీ కన్వీనర్ గా. టి. రామకృష్ణ, కో కన్వీనర్లుగా కే చందు యాదవ్, కె వెంకటస్వామి, కమిటీ సభ్యులుగా కే లక్ష్మి, కే. కాసిం, జెట్టి శ్రీనివాస్ లింగం, ఎం వెంకటేష్, ఎస్ నరసింహ, ఎస్ కే ఇర్ఫాన్, రామస్వామి, సుధాకర్ ఎన్నికైనట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తెలిపారు.