మునుగోడు విజయం BRSకు పునాది : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అఖండ విజయం సాధించిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, మంత్రులు, ఇంచార్జ్ ఎమ్మెల్యే లకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు తెరాస నాయకులకు, కార్యకర్తలకు ప్రతేక ధన్యవాదాలు. తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.


తెరాస విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని, ప్రజా విజయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తున్న శుభసందర్భంగా BRS పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక విజయం పునాది రాయి లాంటిదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, అభివృద్ధి, సంక్షేమమే విజయానికి నాంది పలికిందని, బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసిన , తప్పడు ప్రచారాలు చేసి అడ్డదారిలో గెలవాలని చూసిన ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ప్రజా ఆశీర్వాదం తెరాస పార్టీకే ఉంది అని మరోసారి నిరూపించారని, ప్రజాబలం కలిగిన ఏకైక పార్టీ తెరాస అని పేర్కొన్నారు. వేల కోట్ల కాంట్రాక్ట్ పనులు, ప్రధాని పర్యవేక్షణలో, కేంద్ర హోమ్ మినిష్టర్, కేంద్ర మంత్రులు, బిజెపి పార్టీ అధ్యక్షులు సమావేశాలు నిర్వహించిన ఎన్ని కుయుక్తులు పన్నిన, జిమ్మికులు చేసినా తెరాస గెలుపును ఆపడం ఎవరి తరం కాలేదన్నారు. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు,తెరాస నాయకులకు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, పేరుపేరునా హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు. తెరాస పార్టీ మిమల్ని ఎల్లప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here