ఘనంగా కాపు కార్తీక మాస వన భోజన మహోత్సవం

  • పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి ” శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్ లో కొండాపూర్ కాపు, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వన భోజన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసం సందర్బంగా కొండాపూర్ కాపు, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషమని, ఇది ఒక శుభపరిణామామని అన్నారు. మున్నూరుకాపు, కాపు సభ్యులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని పేర్కొన్నారు. మున్నూరుకాపు,కాపు కుటుంబ సభ్యులకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి భవనల నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. అనంతరం మున్నూరు కాపు మహిళా విభాగం లోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బొటానికల్ గార్డెన్ లో మున్నూరు కాపు మహిళా విభాగం లోగోను విడుదల చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, ప్రభుత్వ విప్ గాంధీ
బొటానికల్ గార్డెన్ లో కార్తీకమాస వన భోజన మహోత్సవంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here