- బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా రూ. 3 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరి పత్రాలను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం అని పేర్కొన్నారు.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కి చెందిన నఫీజ్ బేగం కు రూ. 2 లక్షల 50 వేలు, పాపిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పాశం నాగిరెడ్డికి రూ 1 లక్ష మంజూరైనట్లు తెలిపారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్గాటించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు అబీబ్ బాయ్, జంగం గౌడ్, సంగారెడ్డి, కాశినాథ్ యాదవ్, శేఖర్ గౌడ్, యోగి పాల్గొన్నారు.
