- ఎమ్మెల్యే గాంధీ మరింతగా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హామీ
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనంగా నిర్మిస్తున్న తరగతి గదులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ విలేజ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనంగా నిర్మిస్తున్న తరగతి గదులు పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల సౌకర్యం కోసం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వసుందర దేవి, బాల్ రెడ్డి, మదన్మోహన్, సత్యనారాయణరావు, వీణ, గౌసియా, బాలాజీ పాల్గొన్నారు.





