నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ “శ్రీనిది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి.
ప్రైమరీ విద్యార్థి, విద్యార్థిని వేషధారణలు అలరించారు. సీతాదేవిగా 5వ తరగతి విద్యార్థిని జల్లే, స్రసిని, రాముడిగా టి, ధ్రువన్ తేజ్, లక్ష్మణుడిగా వి. వర్షిత్, హనుమంతుడిగా 4వ తరగతి విద్యార్థి అఖిల్ పోషించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ భావన విద్యార్థులను అభినందించారు. రాముడి ఆదర్శ జీవనం గురించి, ఏకపత్ని వృతుడు పితృవాక్య పరిపాలకుడిగా, సకల గుణాభిరాముడిగా ఖ్యాతి పొందిన రామాయణ గాధను విద్యార్థిని, విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కామేశ్వరి, శ్రీదేవి, కిషన్ పాల్గొన్నారు.