- మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం శేరిలింగంపల్లి మండల యూత్ అధ్యక్షుడు జెల్లె విజయ్ వినతి
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇప్పటివరకు లబ్ధి పొందని వారికే దళిత బందు పథకం వర్తింపచేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం శేరిలింగంపల్లి మండల యూత్ అధ్యక్షుడు జెల్లె విజయ్ అన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ని కలిసి వినతి పత్రం అందజేశారు. సంక్షేమ ఫలాలు నిజమైన లబ్దిదారులకు చేరడం లేదని, సర్వే చేసే అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇంతకు ముందు లబ్ధిపొందిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వకూడదని దళితులు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు ఎలాంటి అవకాశం రాని అర్హులైన దళితులకు ముందుగా ఇచ్చి తదనంతరం మిగతా వారికి ఇవ్వాలన్నారు. గత 30 ఏండ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకోని వారు ఉన్నారని, వారికి ఇవ్వాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ లీడర్లు ఇప్పటివరకు లబ్ధి పొందిన వారికే మళ్లీ అవకాశం ఇస్తున్నారని చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత ప్రభుత్వ అధికారిని పిలిచి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో దళిత బంధు మీటింగ్ ఉందని ముఖ్యమంత్రి, కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ నాయకులు, తదితరులు ఉన్నారు.