నమస్తే శేరిలింగంపల్లి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గణపురం రవీందర్, తెలంగాణ అంబేద్కర్ సంఘం స్టేట్ మహిళా ఉపాధ్యక్షురాలు మల్లెల జయలకు దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డు ను ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ రాగం నాగేందర్ యాదవ్ కి కృతజ్ఞతగా వారి వార్డ్ కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో వెంకటమ్మ, లక్ష్మి, నిరూప, తులసి, సుబద్ర, దివ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.