- గచ్చిబౌలి స్టేడియంలో 20 – 23 వరకు జాతీయ స్విమ్మింగ్ ర్యాంకింగ్ పోటీలు
- మంత్రిని కలిసిన గచ్చిబౌలి స్విమ్మర్స్ అసోసియేషన్
నమస్తే శేరిలింగంపల్లి : దేశంలో మెట్ట మెుదటి సారిగా నిర్వహించే జాతీయ స్విమ్మింగ్ ర్యాంకింగ్ పోటీలకు గచ్చిబౌలి స్విమ్మింగ్ పూల్ వేదిక కావడం పట్ల క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ కొండ విజయ్ కుమార్ లతో ఏర్పాట్లపై శుక్రవారం చర్చించారు. 18 ఏండ్ల పై బడిన సూమారు 1000 స్విమ్మర్లు పాల్గొననున్నట్లు వారు మంత్రికి తెలిపారు. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో పలు ఏర్పాట్లు, మర్మతులను చేయించాలని ఈ సందర్బంగా కోరారు. కార్యక్రమంలో ట్రెజరర్ సమంతారెడ్డి పాల్గొన్నారు.
