మెట్రో కారిడార్ తో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం

  • డిసెంబర్ 9న హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సీఎం కేసిఆర్ శంకుస్థాపన
  • మైండ్ స్పేస్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ విమానాశ్రయం) విస్తరణకు డిసెంబర్ 9న సీఎం కేసిఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో.. మైండ్ స్పేస్ స్థలాన్ని మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మెట్రో ఎండీ NVS రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, ట్రాఫిక్ ఏసీపీ హన్మంత రావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.

మైండ్ స్పేస్ వద్ద ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ కారిడార్ ను సొంత ఖర్చులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, జనావాసాలకు, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సిఎం కేసీఆర్ ముందుచూపుతో ఈ మెట్రో కారిడార్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఐటీ ఉద్యోగులకు, విమానాశ్రయం వెళ్లే వారికి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అంతేకాక ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించామని తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఈ ప్రాజెక్ట్ తలమానికంగా మారుతుందని వెళ్లించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ సిఐ తిరుపతి, రాయదుర్గం సిఐ మహేష్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

మంత్రులకు మైండ్ స్పేస్ వద్ద జరుగుతున్న ఏర్పాట్ల వివరాల చూపుతున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here