- మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మెమొరాండం సమర్పించిన భేరి రాంచందర్ యాదవ్, ఆర్కే సాయన్న
నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య భర్తీ చేయాలని, మౌలిక వసతులు (మరుగుదొడ్లు, రెస్ట్ రూములు) ఏర్పాటు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ కులాల ఐక్యవేదిక చైర్మన్ భేరీ రామచందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మెమొరాండం సమర్పించారు.
అదేవిధంగా పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ముఖ్యంగా స్కాలర్ షిప్ సమస్యలని వీలైనంత తొందరగా పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ , ఓబీసీ ఫెడరేషన్ అధ్యక్షులు పట్లోళ్ల శ్రీరామ్ యాదవ్, భేరీ ఆంజనేయులు యాదవ్, కడుమూరు స్కూల్ కమిటీ చైర్మన్ వెంకటస్వామి గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ గౌడ్, వార్డ్ మెంబర్ బబ్బాయి, వెంకట్ రెడ్డి, మాజీ డిఎస్పి బంటు రాములు, భేరీ రఘురాములు యాదవ్, రాజు గౌడ్, శ్రీనివాస్ యాదవ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.