నమస్తే శేరిలింగంపల్లి : పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయకున్ని పూజించాలని హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ పేర్కోన్నారు. హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో శుక్రవారం హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద పలు స్కూళ్ల విద్యార్థి, విద్యార్థులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా గత 7 ఏళ్లుగా తమ ఫౌండేషన్ ఆద్వర్యంలో మట్టి వినాయకులని పంపిణీ చేస్తున్నట్లు, ప్రస్తుత సంవత్సరం తమ ఫౌండేషన్ ఆద్వర్యంలో 5. వేల మట్టి వినాయకులని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు శంకర్ ముదిరాజ్ , షర్పూద్దీన్, నక్కా శ్రీనివాస్, ప్రకాశ్ గౌడ్, విజయ్, సంతోశ్, ప్రసాద్ పాల్గొన్నారు.