సమస్య రహిత, ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దుతాం: ప్రభుత్వ విప్ గాంధీ

  • గచ్చిబౌలి డివిజన్ లో యుజీడీ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి : కాలనీలను సమస్య రహితంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్, మధుర నగర్, రాయదుర్గం ఎస్సీ బస్తీ, నానక్ రాం గూడ రజక బస్తీ, పుకట్ నగర్, నల్లగండ్ల విలేజ్ , డైమండ్ హైట్స్ కాలనీలో రూ.99 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(యూజీ డి) పైప్ లైన్ నిర్మాణం, మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణం, మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ నిర్మాణం పనులకు, చిల్డ్రన్స్ ప్లే పార్క్ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.

ప్రజలకు స్వచ్ఛమైన మంజీర నీరు అందించడమే ధ్యేయంగా ప్రతి కాలనీ కి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నామని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. యూజీడి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

  • శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు ఇవే..

1. ప్రశాంతి హిల్స్ కాలనీ లో రూ. రూ.30 లక్షల అంచనా వ్యయంతో యుజీడి నిర్మాణం.

2. మధుర నగర్ కాలనీలో రూ.12 లక్షల అంచనా వ్యయంతో యుజీడి నిర్మాణం.

3. నానక్ రాం గూడ రజక బస్తీ, పుకట్ నగర్ కాలనీలో రూ. 35 లక్షల అంచనా వ్యయంతో మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణం.

4.రాయదుర్గం ఎస్సీ బస్తీలో రూ. 6 లక్షల అంచనా వ్యయంతో మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ నిర్మాణం.

5. నల్లగండ్ల విలేజ్ లో రూ. 6 లక్షల అంచనా వ్యయంతో మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ నిర్మాణం.

6. డైమండ్ హైట్స్ లో గల పార్క్ లో రూ. 10 లక్షల అంచనావ్యయంతో చిల్డ్రన్స్ ప్లే పార్క్ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డిజీ ఎం శరత్ చంద్ర రెడ్డి, మేనేజర్ నరేందర్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here