- ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : సర్వ మానవాళి శ్రేయస్సు కోసం.. శాంతిని నెలకొల్పేందుకు మహమ్మద్ ప్రవక్త కారణ జన్ముడిగా అవతరించాడని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్ నందు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ముస్లిం మైనారిటీ సోదరులను ఘనంగా సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను బోధించారని, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, నయీమ్, సదిక్, బషీర్, కతర్, నుర్రుద్దీన్, షైక్ అలీ, అంజద్, ఫయాజ్పా పాల్గొన్నారు.