నమస్తే శేరిలింగంపల్లి : మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లోని శుభం ఫంక్షన్ హాల్ లో గొల్ల , కురుమ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. అంతకుముందు చౌటుప్పల్ లోని మల్లన స్వామి వారిని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో కలిసి మునుగోడు మండల సహ ఇంచార్జి రవి కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఉప పోరులో బీజేపీ పార్టీని గెలిపించాలని వేడుకున్నారు. అనంతరం కార్యక్రమంలో మునుగోడు అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గొల్ల కురుమ ,యాదవులకు పిలుపునిచ్చారు.