నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో దర్గా వద్ద ఉర్సు ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి దట్టి కప్పి, నాట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు బాబు మియా, ఖాసీం, రహీం, లియకాత్, సలీమ్, కాజా,సోహెల్, మునఫ్ సాజిద్,అమీర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.