ఏ ఒక్కరిని వదిలిపెట్టం

  • అభివృద్ధి పేరిట కబ్జాలు, వత్తాసు పలుకుతున్న అధికారులు, అధికార ప్రజాప్రతినిధులు
  • కాలనీలకు దారి ఇవ్వాలనే నెపంతో మట్టిపోసి కబ్జాలు
  • మేడికుంట చెరువు కబ్జాకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టమని మాదాపూర్ డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణయాదవ్ హెచ్చరిక
మేడికుంట చెరువు మధ్యలో మట్టి పోసిన ప్రాంతం

నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి ముసుగులో చెరువులను చెరపట్టేందుకు యత్నిస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని మాదాపూర్ డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణయాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మాదాపూర్ డివిజన్ డివిజన్ లో మొండికుంట చెరువు మధ్యలో మట్టిపోసి కబ్జాకు పాల్పడుతున్నారనే సమాచారం రావడంతో శుక్రవారం ఆయన కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను కబ్జాకోరులు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకు నిదర్శనమే ఈ మొండికుంట కబ్జా యత్నమని తెలిపారు.

మేడికుంట చెరువు మధ్యలో మట్టి పోసిన ప్రాంతాన్ని పర్యటించి పరిశీలిస్తున్న మాదాపూర్ డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణయాదవ్

చెరువు చుట్టు వాకింగ్ ట్రాక్ పేరిట చెరువు మధ్యలో మట్టితో నింపి ఒక వైపు నుంచి కబ్జా చేస్తున్నట్లు తెలుస్తుందని వివరించారు. గతంలో 4 ఎకరాల 4 గుంటల చెరువు.. నేడు రెండు ఎకరాలు కూడా సరిగ్గా లేదని, ఇందుకు కారణం డబా నిర్మాణ సంస్థలు ఆ చెరువు చుట్టు ప్రైవేటు భూములను కొంత కొనుగోలు చేసి చెరువులోకి జరుగుతూ కబ్జాలు చేపట్టారని, కుంట అవతల వైపు నివ్యాసాలకు దారి కావాలనే సాకుతో ఏకంగా ఏకంగా చెరువు మధ్యలో మట్టి కుప్పలు నింపి చెరువును కబ్జాచేసేందుకు ప్రత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఏ ఒక్కరిని బిజెపి వదిలి పెట్టదని హెచ్చరించారు.

మేడికుంట చెరువులో కబ్జాకు గురైన ప్రాంతంలో కార్పొరేటర్ గంగల రాధాకృష్ణయాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here