- శిల్పకళా వేదికలో గౌతమి విద్య క్షేత్ర పాఠశాల వార్షికోత్సవం
- అలరించిన చిన్నారుల నృత్యాలు, నాటక ప్రదర్శన
నమస్తే శేరిలింగంపల్లి: మదీనగూడలోని గౌతమి విద్య క్షేత్ర పాఠశాల వార్షికోత్సవం మాదాపూర్ శిల్పకళా వేదికలో వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ నామినేని శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవం పిల్లలలో దాగున్న సృజనాత్మకతను నైపుణ్యాలను వెలికి తీస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులు చేసిన కార్టూన్ నృత్యాలు, రైతుల ఆత్మహత్యలపై డ్రామా, దశావతారాల విశిష్టతను వివరిస్తూ చేసిన విన్యాసాలు అతిథులను ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్లు అరవింద్ రెడ్డి, శ్వేతా రెడ్డి, ప్రిన్సిపల్ శారద, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.