- కృపా మినిస్ట్రీస్ చర్చిలో క్రిస్టియన్ సోదరి సోదరమణులకు బట్టల పంపిణి
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలోని కృపా మినిస్ట్రీస్ చర్చిలో సెమి క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బట్టలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని ఆదరిస్తూ అందరి అభిమానాలను చూరగొంటున్నదని, రాష్ట్రంలోని అన్ని మతస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, పేద ప్రజలకు ఒక తండ్రిగా ఒక పెద్ద అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, వరలక్ష్మి రెడ్డి క్రిస్టియన్ సోదరి సోదరమణులు తదితరులు పాల్గొన్నారు.
మదినగూడలో ..
చందానగర్ డివిజన్ పరిధిలోని మదినగూడలో ది చర్చి అఫ్ జీసస్ క్రిస్ట్ అఫ్ లేటర్ డే సెయింట్స్ చర్చిలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేదవాడు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి బట్టలు పంపిణి చేశామని అన్నారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, వరలక్ష్మి రెడ్డి, పాస్టర్ సునీల్, క్రిస్టియన్ సోదరి సోదరమణులు పాల్గొన్నారు.