క్రమం తప్పకుండా పరీక్షలు.. జాగ్రత్తలు అవసరం

నమస్తే శేరిలింగంపల్లి: క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ.. జాగ్రత్తలు వహిస్తే మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచవచ్చని  వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని పిజెఆర్ స్టేడియం వద్ద  చందానగర్ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో..ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధి పరీక్షలు నిర్వహించారు.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడారు.  మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన  పుట్టిన రోజు నవంబరు 14ను ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం,  రక్తనాళాలు దెబ్బతిని రక్తం సరియైన రీతిలో సరఫరా కాక పాదాలకు ఇన్ఫెక్షన్, కంటి చూపు కోల్పోవడం, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి కోట్లాది మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తేల్చి చెబుతున్నాయని స్పష్టం చేశారు.

ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్ బృందం

ప్రపంచంలో అత్యధిక మధుమేహ వ్యాధి ఉన్న ఐదు దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని తెలిపారు. నిత్య వ్యాయామం, నడక, మెడిటేషన్, తాజా ఆకుకూరలు, ఆరెంజ్, జామ, బొప్పాయి , డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు క్రమం తప్పకుండా తీసుకుంటూ.. మధుమేహ పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  సూచించారు ఈ  సందర్భంగా 120 మందికి మధుమేహ, రక్తపోటు, పల్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్ మల్లేష్, జనార్ధన్, అమ్మయ్య చౌదరి, హాస్పిటల్ ప్రతినిధి నరేష్  పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here