- ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఉపేందర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నేడు, రేపు రెండు రోజుల పాటు మియాపూర్, ముజాఫర్ అహ్మద్ నగర్ లో సామాజిక, రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు శిక్షణ తరగతులకు హాజరై ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ వల్లేపు ఉపేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత దోపిడీ, పెట్టుబడి దారీ వ్యవస్థను నిర్మూలించి, దీని స్థానంలో సమస్థ మానవాళి సమానత్వం సాధించేదే కమ్యూనిస్టు లక్ష్యమని అన్నారు. దేశంలో సామ్రాజ్యవాద అండతో పెట్టుబడి దారీ వ్యవస్థ బలపడిందని, పెట్టుబడి దారుల ఆర్థిక విధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ప్రభుత్వాల అనాలోచిత పాలన వల్ల నేడు ప్రజలు హక్కులు కోల్పోతున్నారన్నారు. ధరల భారాలు పెరుగుతున్నాయి. విద్యా, వైద్యం, కూడు, గూడు సామాన్యులకు అందుబాటులో లేని వ్యవస్థ కొనసాగుతున్నదని ఆరోపించారు. పెట్టుబడి దారీ వ్యవస్థ కు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, సమస్త ప్రజలు సమానంగా ఉండే వ్యవస్త ను సాధించే కమ్యూనిస్టు లక్ష్యాన్ని బలపర్చాలని పిలుపునిచ్చినారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సామాజిక, రాజకీయ శిక్షణ తరగతులలో మొదటి రోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుండి ఎంసీపీఐయూ సభ్యులు పాల్గొన్నారు.