- పనులను పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య కాలనీలో రూ.30 లక్షలతో నూతనంగా సీసీ రోడ్డు ను నిర్మిస్తున్నారు. ఈ పనులను కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పనుల్లో నాణ్యత కొరవడద్దని, నిర్ణీత సమయంలో సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సాయి ఐశ్వర్య కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ జగదీష్, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు అరుణ్ గౌడ్, నర్సింగ్ నాయక్, వరలక్ష్మి, సాయి ఐశ్వర్య కాలనీ వాసులుప్రభాకర్ రెడ్డి, జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.