- గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా మైదం శెట్టి రమేష్, సహయ కార్యదర్శిగా తుడుం అనిల్ కుమార్ ఎన్నిక
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్, ముజఫర్ అహ్మద్ నగర్ లో నిర్వహించిన ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ ప్లీనరీ విజయవంతంమైందని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ వనం సుధాకర్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎంసిపిఐ(యు) ప్రజా ఉద్యమాల బలోపేతానికి పార్టీ నిర్మాణ పటిష్టత కోసం 31 మందితో ప్లీనరీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీని ఎన్నుకున్నదని, 11 మందితో కార్యదర్శవర్గాన్ని ఎన్నుకున్నదని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా మైదంశెట్టి రమేష్ ను, సహాయ కార్యదర్శిగా తుడుం అనిల్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. పాలకవర్గాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి పలు ప్రజా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబల్ బెడ్ రూమ్ ల సాధన, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేవరకు పోరాడాలని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మిగులు ప్రభుత్వ భూములను రక్షించి, ఇండ్ల స్థలాల కింద పంపిణి అయ్యేవరకు పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించింది. అనేక సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న వారికి ఇండ్ల పట్టాలు, కనీస మౌలిక వసతులు కల్పించే వరకు ప్రజా పోరాటాలు చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్ ప్లీనరీ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఎంసిపి ఐ( యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా మైదం శెట్టి రమేష్, ఎం సి పి ఐ( యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శిగా తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కమిటీకి మైదం శెట్టి రమేష్, తుడుం అనిల్ కుమార్, వి. తుకారం నాయక్, కుంభం సుకన్య, తాండ్ర కళావతి, పి.భాగ్యమ్మ, కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, అంగడి పుష్ప, లసాని రాజు, బి. యాదగిరి, బి. విమల, ఈ. కిష్టయ్య, దుర్గ ప్రసాద్, దేవనూర్ లక్ష్మి, బి. కె నారాయణ, గణేష్, లక్ష్మణ్, నజీర్, శ్యామ్ సుందర్, రంగస్వామితో పాటు కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా కామ్రేడ్ గాదె మల్లేష్, ఎం వై యాదగిరి కుమార్ లను ఎన్నుకున్నారు.