టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మహాసభకు తరలివెళ్లిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు

  • పిజెఆర్ స్టేడియం నుంచి ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు
  • జర్నలిస్టుల సమస్యలను ఎన్నింటినో పరిష్కరించుకున్నాం
  • జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాం : మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మహాసభకు పిజెఆర్ స్టేడియం నుంచి ర్యాలీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు

నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే మహాసభలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కొంగర కలన్ లో నిర్వహించిన మహా సభ కు శేరిలింగంపల్లి జర్నలిస్టులు ప్రత్యేక వాహనాలలో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. శుక్రవారం ఉదయం చందానగర్ పిజెఆర్ స్టేడియం నుంచి TUWJ శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీగా కొంగర కలన్ మహా సభకు బయలుదేరి వెళ్లారు. ర్యాలీని TUWJ రాష్ట్ర నాయకులు ఫైళ్ల విట్ఠల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ లు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కొంగర కలన్ లో నిర్వహించిన మహా సభలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లతో పాటు యూనియన్ రాష్ట్ర నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యూనియన్ టియుడబ్ల్యుజే అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వ సహకారంతో జర్నలిస్టుల సమస్యలను ఎన్నింటినో పరిష్కరించుకున్నామని, జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు సైతం ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, టీజేఎఫ్ పోరాటంలో, టియుడబ్ల్యూజే యూనియన్ నిర్మాణంలో రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులది ప్రత్యేక స్థానం అన్నారు. రంగారెడ్డి జిల్లా మహా సభలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో జర్నలిస్టులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here