చేగువేరా కూతురు, మనుమరాలు సభను విజయవంతం చేయండి

  • ఎం సీపీఐ(యూ) ప్రజాసంఘాల పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి : 22న తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విప్లవయోధుడు, సామ్రాజ్య వాదుల సింహాస్వప్నం చే గువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్టీఫినా గువేరాల సభను జయప్రదం చేయాలని మియాపూర్, ముజఫర్ అహమ్మద్ నగర్ లో సమావేశంలో ఎం సీపీఐ(యూ) ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అమెరికా సామ్రాజ్య వాద ఆంక్షలను ఎదురించి క్యూబా కు పెడరల్ కాస్ట్రో తో కలసి సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేసిన సామ్రాజ్యవాదుల సింహ స్వప్నం చే గువేరా అని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం పై పోరాడి అనేక దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేని సోషలిస్టు వ్యవస్థ స్థాపనకు చే గువేరా పోరాట స్ఫూర్తి ఘనమైనది అని అన్నారు. ప్రపంచ దేశాలకు, పోరాడే తరానికి చేగువేరా ఒక ఐకాన్ గా నిలిచారని అన్నారు. చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎల్తిపినా గువేరా లు భారతదేశ పర్యటనలో భాగంగా ఈనెల 22న మన రాష్ట్రానికి హైదరాబాద్ కు విచ్చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో క్యూబా సంఘీభావ సభ ను అన్ని కమ్యూనిస్టు, వామపక్ష, ప్రజా సంఘాలు, ఇతర పార్టీల నేతృతంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని యువకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ సమావేశంలో ఎం సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, ఏఐసిటియు రాష్ట్ర అధ్యక్షులు తుడం అనిల్ కుమార్, కమిటి సభ్యులు యల్. రాజు, ఇ.దశరథ్ నాయక్, కే.రాజు, లక్ష్మణ్, అనిల్ రెడ్డి, ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ఏఐఎఫ్ డిడబ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అంగడి పుష్ప, కమిటీ సభ్యురాలు గూడా లావణ్య, ఏఐఎఫ్ డివై గ్రేట్ హైదరాబాద్ యువతుల విభాగం కన్వీనర్ యం.డి. సుల్తానా, కన్వినింగ్ కమిటీ సభ్యులు కే షరీష్ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎం సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ 
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here