కన్విక్షన్ల శాతాన్ని పెంచాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

  • 2023 సంవత్సరానికి గాను లక్ష్యాలపై దిశా నిర్దేశం
  • – నేరాల నియంత్ర‌ణ‌, పోలీసు దర్యాప్తు తీరుతెన్నుల‌పై సైబరాబాద్‌ సీపీ సమీక్షా సమావేశం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సిపి స్టీఫెన్ రవీంద్ర

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధి మాదాపూర్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించి, 2023 సంవత్సరానికి గాను ఛేదించే లక్ష్యాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి మాదాపూర్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల లో సిబ్బంది నేరాల సంఖ్యను తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోనే సైబరాబాద్ కమీషనరేట్ పరిధి లోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి తదితర ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలు పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణ ఉన్నందున నేర నియంత్ర‌ణ‌, శాంతి భద్రతలను అదుపులో ఉన్నట్లయితే పౌరులకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. 2023 సంవత్సరానికి అన్ని పోలీస్ స్టేషన్‌ల సిబ్బందికి నేర నియంత్రణలో సాధించాల్సిన లక్ష్యాలపై దిశ నిర్దేశం చేశారు. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్, ప్రొయాక్టివ్ పోలీసింగ్ పద్ధతులను అవలంబించి గస్తీ వాహనాలు ఎల్లవేళలా ప్రజా రద్దీగా ఉండే ప్రాంతాలలో, కూడళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలపై నిఘా ఉంచి, పోలీస్ స్టేషన్లో నమోదైన అన్ని కేసులను చట్ట ప్రకారం నాణ్యమైన పద్ధతులలో దర్యాప్తు చేసి త్వరతగతిన చార్జ్ షీట్లు వేసి కోర్టులలో దర్యాప్తు అధికారులు సమర్పించాలని ఆదేశించారు. కోర్టు అటెండెన్స్, కన్విక్షన్లు, విట్ నెస్ లపై దృష్టి సారించాలన్నారు.ముఖ్యంగా సెక్టార్ ఎస్ఐలు బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తదనుగుణంగా పాయింట్ పుస్తకాల పునర్వ్యవస్థీకరణ చేయాలన్నారు. MO క్రిమినల్స్, హిస్టరీ షీటర్స్ , రౌడీ షీటర్ల కార్యకలాపాలపై స్థానిక SHOలు నిఘా ఉంచి వారు ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా చూడాలన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించకుండా చూడాలని ఆదేశించారు. పీడీ యాక్ట్ లా నమోదు, సీసీటీవీ లా ఏర్పాటు పై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీతో పాటు .. క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిరా, సైబర్ క్రైమ్స్ అడిషనల్ డీవీపీ రితిరాజ్, ఐపీఎస్., క్రైమ్స్ ఏడీసీపీ నర్సింహా రెడ్డి, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

సమావేశానికి హాజరైన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here