- ఎంసిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ కుంభం సుకన్య
నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామని ఎంసిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ కుంభం సుకన్య తెలిపారు. మియాపూర్ లో జరిగిన ఎంసిపిఐ యూ మియాపూర్ డివిజన్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2018 ఎన్నికలలో TRS ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రకటించి సరైన నిధులు కేటాయించలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నా మన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల ముందు అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని, ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు ఇండ్ల స్థలాల కింద పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ కార్డులలో ఉన్న తప్పొప్పులను సరిచేయాలని, కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని, యస్.సి,యస్. టీ, బి.సి, మైనార్టీ కార్పొరేషన్ లకు నిధులు కేటాయించాలని తదితర డిమాండ్లతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచారు. కామ్రేడ్ జి.శివాని గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రేట్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కర్ర దానయ్య, పల్లె మురళి, ఇ.దశరథ్ నాయక్, కమిటి సభ్యులు వై.రాంబాబు, బి.విమల,మియాపూర్ డివిజన్ నాయకులు కే.చందర్,బి. కే నారాయణ, యన్.గణేష్, లక్ష్మి నరసింహ, యం.రాణి, యం.డి.సుల్తానా బేగం, దారా లక్ష్మి, లలిత, మలేశ్వరి పాల్గొన్నారు.