అంబేద్కర్ కు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని న్యూ గుడ్ షెప్పర్డ్, డెఫ్ అండ్ డమ్ స్కూల్ వద్ద భారతరత్న డా. బి, ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ తరతరాలుగా అణగారిన వర్గాల సర్వతోముఖాభివృద్ధికై కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకై కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి మెర్సి, అధ్యాపకురాలు శ్రీదేవి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, మల్లేష్,సాంబశివ గౌడ్ పాల్గొన్నారు.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న డా. బి, ఆర్. అంబేద్కర్ కు న్యూ గుడ్ షెప్పర్డ్, డెఫ్ అండ్ డమ్ స్కూ ల్ విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here