నమస్తే శేరిలింగంపల్లి : బీహార్ రాష్ట్రం ముజాఫర్ పూర్ లో 12 నుంచి 15 వరకు జరగనున్న ఎంసిపిఐ(యు) అఖిలభారత 5వ మహాసభలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంసిపిఐయు ప్రతినిధులు సుమారు 35 మంది వరకు వెళ్లారని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ తెలిపారు. ఈ మహాసభలలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వెలుగులో దేశ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై, బిజెపి మతోన్మాదం, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా వాటిని బలపరిచే వివిధ రాష్ట్రాలలోని పాలక ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వామపక్ష, కమ్యూనిస్టు ఐక్య పరచడం, సామాజిక శక్తులను సమీకరించి బలమైన ఉద్యమాలు నిర్మించే దిశగా వెళ్లేలా దిశా నిర్ధేశం చేయనున్నారని తెలిపారు. ఈ మహాసభలకు మియాపూర్ ప్రాంతం నుండి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్, కుంభం సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి తుకారం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్ టి అనిల్ కుమార్, కొండముని వెంకటయ్య, పి భాగ్యమ్మ, ఏ పుష్ప, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు కర్ర దానయ్య, ఈ దశరథ్ నాయక్, డి. మధుసూదన్, పి. శ్యామ్ సుందర్, విమల మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు డి రంగస్వామి, నరిశెట్టి గణేష్, వై రాంబాబు, ఎం రాణి, జి లావణ్య, ఎండి సుల్తానా, శివాని, రజియా, చోక్కం, పుష్పలత, ఎన్ రమ, ఇందిర తదితరులు మహాసభల విజయానికి తరలివెళ్లారు.