- కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన నాగేంద్రను అభినందించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : ఢిల్లీలో నిర్వహించిన వాకో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ 51 కేజి విభాగంలో గోపినగర్ కాలనీకి చెందిన ఎం.నాగేంద్ర సిల్వర్ మెడల్ సాధించిన తెలిసిందే. తెలంగాణ తరఫు నుంచి పోటీల్లో సత్తా చాటిన నాగేంద్రను మసీద్ బండ, కొండాపూర్ లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడారంగంలో కూడా రాణించి సమాజానికి , తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. క్రీడారంగంలో నైపుణ్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారికి నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని, రాబోయే కాలంలో కూడా క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంచర్ల ఎల్లేష్, సాయికుమార్, సతీష్, గోపాల్ పాల్గొన్నారు.