13 న కార్తీక వన సమారాధన… బ్రాహ్మణ బంధువులకు మియాపూర్ గాయత్రి బ్రాహ్మణ అసోసియేషన్ పిలుపు…

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ గాయత్రి బ్రాహ్మణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ తేదీన ఆదివారం ‘కార్తీక వన సమారాధన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాచుపల్లి వోల్వో బస్సు స్టాప్ వద్ద సాయి అనురాగ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటల వరకు, ఆట, పాటలు, రుద్రాభిషేకం, సాంస్కృతిక పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందుకు గాను ప్రతి ఒక్కరు రూ. 151 చెల్లించి రశీదు పొంది ప్రకృతి, పరమాత్ముడి అనుగ్రహానికి పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు. అత్యంత శ్రేష్ఠమైన అన్న సమారాధనకు విరాళాలు ఇవ్వాలనుకునేవారు, రుద్రాభిషేకంతో పాల్గొనాలనుకునే వారు.. వివరాలకు పి. ఆర్ కె మూర్తి, 79814 13159, పి.ఎస్.శంకర్ 93469 71918 లను సంప్రదించగలరని కోరారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here