సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది

  • గచ్చిబౌలి డివిజన్ లో రూ.7కోట్ల 75 లక్షల అంచనా వ్యయంతో
    థీమ్ పార్కు లు, సీసీ రోడ్ల నిర్మాణం
  • పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ, గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్, నానక్ రాంగూడ, రాయదుర్గం కాలనీలలో రూ.7కోట్ల 75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే థీమ్ పార్కు లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబాలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కోసం కృషి చేస్తానని చెప్పారు. థీమ్ పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామనితెలిపారు. కాంక్రీట్ కారణ్యంలో థీమ్ పార్క్ లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.
నల్లగండ్ల హుడా లేఅవుట్ లో రూ.3 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో థీమ్ పార్క్ నిర్మాణం, మరో చోట రూ.2 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో థీమ్ పార్క్ నిర్మాణ పనులు, గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో రూ. 1 కోటి 20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, నానక్ రాంగూడలో రూ. 25 లక్షల అంచనా వ్యయంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రాయదుర్గంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, తెరాస నాయకులు చెన్నం రాజు, మంత్రి ప్రగడ సత్యనారాయణ, శ్రీను పటేల్, దారుగుపల్లి నరేష్, జంగయ్య యాదవ్, సురేందర్, సతీష్, సంపత్, మల్లేష్, వినోద్, యాదగిరి, వసంత కుమార్, రమేష్, రాజు ముదిరాజు, సల్లావుద్దీన్, అక్బర్,సురేష్ నాయక్, నర్సింహ రాజు, రామేశ్వరమ్మ , అంజమ్మ, బాల మణి, ఇందిరా తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

థీమ్ పార్కు లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here