- మద్దతు తెలిపిన మయూరి నగర్ వాసులు
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మయూరి నగర్, కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీ కే ఉంటుందని , వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
మళ్లీ బిఆర్ యస్ పార్టీ కి ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.