సమస్యలు పరిష్కరించి.. నిధులు విడుదల చేయాలి

  • జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో మేయర్ ఛాంబర్ ఎదుట బిజెపి కార్పొరేటర్లతో కలిసి
    గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిరసన

నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తమ డివిజన్లకు అధికార పక్షం నిధులు కేటాయించకుండా, సమస్యలు వదిలేసి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతున్నారని.. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిరసన ప్రదర్శన చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించి, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ల కౌన్సిల్ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఛాంబర్ ఎదుట బిజెపి నాయకులతో కలిసి నిరసన చేపట్టారు.

మేయర్ ఛాంబర్ ఎదుట బిజెపి కార్పొరేటర్లతో కలిసి నిరసన తెలుపుతున్న
గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్లో అభివృద్ధి కోసం ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హైదరాబాద్ లోని సమస్యలపై చర్చించకుండా జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదించడంపై భాజపా కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ గందరగోళం మధ్యే 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ అంచనా బడ్జెట్‍ను మేయర్ ఆమోదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు సుప్రియ గౌడ్, రవి చారి, వినయ్ కుమార్, రాంచన శ్రీ, సరళ, సుచరిత, దీపిక, అరుణ, భాగ్యలక్ష్మి బొక్క, అలె భాగ్య లక్ష్మి, జంగం శ్వేతా, వెంకటేష్, లక్ష్మి గౌడ్, ఉమా రాణి, అమృత, వెంకట్ రెడ్డి, శంకర్ యాదవ్, లాల్ సింగ్, శశికళ, బోణీ దర్శన్, కరుణాకర్, స్రావం, సునీత, రాజ్య లక్ష్మి, చంద్ర రెడ్డి, మహేందర్, హరీష్, శ్రీవాణి బండారు, రాధా ధీరజ్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, సంగీత, తోకల శ్రీనివాస్ రెడ్డి, లేచి రెడ్డి, రంగ నర్సింహా గుప్త, వంగ మధుసూదన్ రెడ్డి, ప్రేమ్ మహేష్ రెడ్డి, సుజాత, కళ్లెం నవజీవం రెడ్డి, పవన్ కుమార్ ముదిరాజ్, కొప్పుల నర్సింహా రెడ్డి, చింతల అరుణ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఫ్ల కార్డులతో నిరసన తెలుపుతున్న బిజెపి కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here