మహిళా భవనం నిర్మించండి

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి మహిళా సోదరీమణుల విన్నపం
  • వేడుకగా మహిళా సోదరీమణుల ఆత్మీయ సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: హఫిజ్ పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీలో హాఫిజ్ పెట్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు శభాన అంజూమ్ ఆధ్వర్యంలో మహిళా సోదరీమణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మియాపూర్ సిఐ తిరుపతిరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళ సోదరీమణులు మాట్లాడుతూ మా కాలనీలో మహిళా భవనం నిర్మించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతి అని, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. మహిళల కోసం కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, షి టీమ్స్ వంటి పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు పెద్దన్నగా అండగా నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళ సోదరీమణుల కోరిక మేరకు మహిళ భవనం నిర్మించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాహిర్, సుదేష్ కుమార్, కలీల్, ఇమ్రాన్, రహీం, అరిఫ్, దౌలత్ కటన్, నజియా బేగం, లక్ష్మీ, జరిన బేగం, రేఖ దేవి, విమల బాయి, తేజమ్మ, రష్మి సింగ్, సువర్ణ పాల్గొన్నారు.

మహిళా సోదరీమణుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here