పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి

  • ఖాజాగూడ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
  • సమస్యలపై వినతిపత్రం అందించిన ప్రథమ ఉపాధ్యాయులు
ఖాజాగూడ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రథమ ఉపాధ్యాయులు వెంకట్ రామ్ రెడ్డి, శ్యామల పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా.. అక్కడ ఉన్న సమస్యలను ఆయన పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలపై, మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్తు సదుపాయాలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగది షెడ్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో చ‌దివేలా పాఠ‌శాల‌ను తీర్చిదిద్దామ‌ని చెప్పారు. క‌ష్ట‌ప‌డి చ‌దివితే రానున్న‌ జీవితంలో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంద‌ని, క్రమశిక్షణతో నడుచుకొని చదువుల్లో రాణించి గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు వెంకట్ రామ్ రెడ్డి, శ్యామల, ఉపాధ్యాయులు నరహరి, శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి తిరుపతి, సుజాత, మమతా, భాను ప్రకాష్ రెడ్డి, థెరెసా, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ శివ, సీనియర్ నాయకులు శేఖర్, ప్రభాకర్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు.

ఖాజాగూడ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రథమ ఉపాధ్యాయులు, నాయకులతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here