- మాతృశ్రీ నగర్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ కాలనీలో ఆ కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కాలనీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.