నమస్తే శేరిలింగంపల్లి : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మరణించిన సంఘటన చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు అజిత్ కుమార్ యాదవ్ (30) దమేంద్రకుమార్ (33) బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నారు. దమేంద్రకుమార్ తన స్నేహితుడు నీరజ్ కుమార్ తో కలిసి అజిత్ కుమార్ గంగారాంలోని జేపీ సినిమాస్ పక్కన చందన్ టీ స్టాల్ లో పని చేస్తున్నారు. 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు ధమేంద్ర యాదవ్, నీరజ్ కుమార్ భారీ వర్షం కారణంగా టీ స్టాల్‌ను మూసివేసే ప్రయత్నంలో టీ బండిని విద్యుత్ స్తంభానికి కట్టేస్తుండగా.. విద్యుత్ షాక్ కు గురయ్యాడు.
వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మదీనగూడలోని అర్చన ఆసుపత్రికి తరలించగా… అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని అజిత్ కుమార్ కు సమాచారం అందించగా.. చందా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.