- ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
- బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించుకుంటామని కాలనీ సభ్యుల వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ కాలనీవాసులతో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ నగర్ కాలనీవాసులు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి పూర్తి మద్దతు తెలియచేయడం చాలా గొప్ప విషయమన్నారు.
ప్రతీ ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలిపారు. మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.